
వైసీపీ నేత వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కరీంనగర్ లోకి ప్రవేశించనుంది.. వరంగల్ జిల్లాలోని వైఎస్ మృతి బాధిత కుటుంబాలను పరామర్శించిన షర్మిల నేడు భూపాలపల్లి నుంచి మంథని నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు.
కరీంనగర్ లో మంథని, పెద్దపల్లి, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాలకు గుండా ప్రయాణించి వైఎస్ మృతి బాధితులను పరామర్శిస్తారు.