నేడు కరీంనగర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

కరీంనగర్ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కరీంనగర్ లో పర్యటించనున్నట్లు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ శివారు అల్గునూర్ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారని.. అక్కడి నుంచి కాంగ్రెస్  కార్యకర్తలు ర్యాలీగా కరీంనగర్ డీసీసీకి చేరుకుంటారని తెలిపారు.

అనంతరం డీసీసీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని.. సూచనలు, సలహాలు స్వీకరించి కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్యచరణ రూపొందిస్తారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *