హైదరాబాద్, ప్రతినిధి : ఎంసెట్ షెడ్యూల్ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఖరారు చేయనుంది. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను కూడా ఇవాళ ఖరారు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. ఈ సారి జేఎన్టీయూకే ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి.. ఇప్పటికే జీవో జారీ చేసింది. ఇవాళ ఎంసెట్ తేదీలు, ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలపైనా తుది నిర్ణయం తీసుకోనుంది. ఎంసెట్ ప్రవేశ పరీక్షను సొంతంగా నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.