
-నేటి నుంచి అమల్లోకి విభజన
హైదరాబాద్ : ఏపీఎస్ ఆర్టీసీ బుధవారం రెండు స్వతంత్ర సంస్థలుగా విడిపోయింది. ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పనిచేయనుంది. ఇప్పటి నుంచి ఎవరి ఆదాయం వారిదే.. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత ఆర్టీసీ విభజన పూర్తి కావడం విశేషం.
కాగా ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్న సాంబశివరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బాధ్యతలు చేపట్టారు. జేఎండీ హోదాలో రమణారావు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా తాత్కాలికంగా బాధ్యతలను చేపట్టనున్నారు. రెండు కార్పొరేషన్లకు విడివిడిగా పద్దులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆస్తుల పంపిణీ కూడా తుది దశకు చేరుకుంది.