
ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పవిత్ర రంజాన్ పండుగ నేటి నుంచి మొదలైంది. గురువారం నెలవంక మబ్బుల వల్ల కనిపించలేదు. కానీ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం గురువారమే నెలవంక దర్శనానికి చివరిరోజు. దీంతో జూన్ 19 అంటే ఇవాళ నుంచి రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు.
కాగా రంజాన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో హలీం సెంటర్లు వెలిశాయి. ముస్లింలతో పాటు హిందువులు రంజాన్ మాసంలో హలీం, ఇతర మాంస పదార్థాలు ఇష్టం గా తింటారు.
ఇక కరీంనగర్ లో బస్టాండ్ నుంచి గీతా భవన్ వెళ్లే దారిలో ప్రతీ ఏడాది లాగే కొందరు హలీం సెంటర్లు ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీ, చికెన్ డీప్ ఫ్రై, పొట్టేలు మాంసం, ఇతర నాన్ వెజ్, వెజ్ ఐటంలను భారీగా ఉంచారు. సాయంత్రం నుంచి ఇవి ప్రారంభమవుతాయి.