నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు..

021parlament

ఈనెల 26నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.. తొలిరెండు రోజులు బీ.ఆర్ అంబేద్కర్ గౌరవార్థం రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశాలు, చర్చలు జరపాలని నిర్ణయించారు.

కాగా ఈ సారి పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకోవాలని ప్రధాని మోదీయే రంగంలోకి దిగారు. అఖిల పక్షంలో పాల్గొని ప్రతిపక్షాలకు విన్నవించారు. ఏడు కొత్త బిల్లులు సహా 58 బిల్లులు, జీఎస్టీ వంటి కీలక బిల్లులు ,22 ప్రాధాన్య బిల్లులు ఇందులో ఉన్నాయి.

కాగా ప్రతిపక్షం దేశంలో మతస్వేచ్ఛ అసహనం పై చర్చ పెట్టాలని డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం ఇది రాష్ట్రాల పరిధిలోనిదని దీనిపై  చర్చ అవసరం లేదని స్పష్టం చేసింది.

అధికార, ప్రతిపక్షాల సొంత ఎజెండాలతో సామాన్యుల కష్టాలు, ధరలు పెరుగుదల, అతివృష్టి, కరువు పరిస్థితులు చర్చకు రాకపోవడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *