
రెండు రాష్ట్రాల శాసనసభా సమావేశాలు ఒకేరోజు శనివారం ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాలపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాయి. ముందుగా గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
11న తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 12న బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సభలు సభల కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులకు వేర్వేరుగా గేట్లు ఏర్పాటు చేసి వివాదం తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.