నేటి నుంచి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) 8వ ప్లీనరీ

01

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 8వ ప్లీనరీ మహాసభలు ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని కే హెచ్ టీ క్యాంపస్ లో ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్లీనరీ సమావేశాలను కేంద్రం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభిస్తారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా అధ్యక్షత వహిస్తారు. ఒడిశా సమాచార, ఆరోగ్య శాఖ మంత్రి ఏ సవ్యసాచి నాయక్ తో పాటు కేఐఐటీ యూనివర్సిటీ ఫౌండర్ అచ్చుత సమంత పాల్గొంటారు.

02

 

ఒడిశా జర్నలిస్ట్ యూనియన్ ఆతిథ్యమిస్తున్న ఈ ప్లీనరీ సమావేశాలలో దేశంలోని ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాలయ(ఉత్తర), జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఢిల్లీ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్ , చండీఘడ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, త్రిపుర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలిపారు. యూనియన్ నాయకులు కే.శ్రీనివాస రెడ్డి, సఖీనా ఇంద్రజిత్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్ నాథ్ తదితరులు పాల్గొంటారని అమర్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *