
సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ముల్కనూర్ లో పర్యటించినప్పుడు అందరూ ఆయన కాళ్లు మొక్కారు. సమస్యలు తీర్చాలని ఏడ్చారు. దీనిపై కేసీఆర్ ముల్కనూర్ గ్రామ సభలో ప్రస్తావించారు..
ముల్కనూర్ ప్రజలు ఇక ఏడ్వడం. కాళ్లు మొక్కడం చేయనవసరం లేదు.. ఎందుకంటే ఇది సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం.. గ్రామ రుపు రేఖలు మారుస్తా.. కేసీఆర్ ఊళ్లో ఏడిస్తే నాకు ఇజ్జత్ పోతది.. సమస్యలు మీ గడప తొక్కకుండా చేస్తా.. ఇక నెల తర్వాత వస్తా. . మళ్లీ ఎవ్వరు ఏడ్చినా రూ. 50 ఫైన్ వేస్తానన్నారు. సమస్యలు తనతో చెప్పుకోవాలని అన్నీ తీరుస్తానన్నారు.