
హైదరాబాద్: టీయూడబ్ల్యూజే నేతలు ఇవాళ మంత్రి కేటీఆర్ ను కలిశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇతర సమస్యలను విన్నవించారు. సమస్యల పరిష్కారం పై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వాధికారులతో సమానంగా జర్నలిస్టులకు కార్డులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. నెలాఖరులోగానే హెల్త్ కార్డులు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ఈ మధ్యనే చనిపోయిన జర్నలిస్టులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రమాద బీమా మొత్తాన్ని అందజేస్తామన్నారు.