
ఏపీ సీఎం చంద్రబాబు తనమకాంను విజయవాడకు మార్చుతున్నారు. నెలరోజుల్లో ఆయన తన పాలనను గుంటూరు నుంచే కొనసాగించబోతున్నారు. అమరావతి కాలువ పక్కన లింగమనేని ఎస్టేట్ కు చెందిన గెస్ట్ హౌజ్ ను ఆయన తన స్వగృహంగా ఎంపిక చేశారు.
ఇక తనకు అధికారం ఇచ్చిన ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే విజయవాడకు మకాం మర్చుతున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు భార్య భువనేశ్వరీ, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఉండేందుకు వీలుగా ఇంట్లో వాస్తు మార్పులు చేయిస్తున్నారట.. గత నెల 29న భువనేశ్వరీ, చంద్రబాబులు కొత్త ఇంట్లో పాలు పొంగించారట.. దీంతో వచ్చే నెలలో ఏపీ పాలన ఏపీ నుంచే..