నువ్వో ఐటం గర్ల్ వి.. రాత్రిళ్లు కలుస్తావ్ నువ్వు..

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థి ఖరారు కోసం తెలంగాణ టీడీపీ సమావేశం నిన్న హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసులో తెలంగాణ టీడీపీ అద్యక్షుడు ఎల్ రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి , రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. వరంగల్ అభ్యర్థిని టీడీపీ తరఫున నిలబెడదామని రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రతిపాదించారు. కాగా దీనికి టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానం ఇచ్చామని మిత్ర ధర్మం పాటించి ఈ సారి బీజేపీకి అవకాశం ఇద్దామని ఎర్రబెల్లి అనడం మాటల యుద్ధం కొనసాగింది..
పార్టీలో అసెంబ్లీ ఎర్రబెల్లి పెత్తనమే కొనసాగుతోందని.. కార్యకర్తలకు మెసేజ్ లల్లో కూడా తన పేరును పెట్టడం లేదని.. కేసీఆర్ రాత్రిళ్లు కలుసుకొని పార్టీ మారుదామనుకునే వాల్లకే పార్టీలో గౌరవం ఉందని ఎర్రబెల్లి ని ఉద్దేశించి రేవంత్ విమర్శించారు. దీంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది..

ఈ మాటలకు ఆగ్రహించిన ఎర్రబెల్లి ‘నువ్వో ఐటం గర్ల్ వి. సమావేశాలకు ఎప్పుడొస్తావో.. ఎప్పుడు పోతావో.. మాట మీద నిలబడని వ్యక్తివి’ నేను కేసీఆర్ ను ఎప్పుడైనా కలుస్తా.. ఇప్పుడూ కలుస్తా.. అని మండిపడ్డారు. నీతో పార్టీకి ఒరిగేదేమీ లేదని. కొత్తగా సీట్లు గెలిచామా నీవల్ల.. ? నీతా పార్టీకి ఏమన్నా లాభం వచ్చిందా.? నువ్వు పార్టీతో బాగుపడ్డావ్. ఓటుకు నోటు కేసుతో ఇప్పటికే పరువు పోయింది.. అంటూ రేవంత్ పై ఒక్కసారిగా ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు..దీంతో తెలంగాణ టీడీపీ సమావేశం రసాభాసగా ముగిసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *