
దేశంలో ఎన్నో పెరుగుతున్నాయి.. జుట్టు పెరుగుతుంది.. గడ్డం మీసాలు పెరుగుతాయి.. ధరలు పెరుగుతాయి.. నిత్యవసరాలు చుక్కలనంటుతున్నాయి.. ఆఖరుకు ఉల్లిపాయలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి.. పెట్రోల్ మండిపోతోంది.. కానీ ఒక్కటి మాత్రం పెరగడం లేదు.. అదే జీతం..
నిత్యవాసరాలు పెరిగినంతగా జీతం పెరగకపోయేసరికి సామాన్యుడు తట్టుకోలేకపోతున్నాడు.. జీతం యాజమాన్యాల చేతులో ఉండేసరికి అసలు వాటిపై నియంత్రణే లేకుండా పోయింది. యాజమన్యాల దయాదాక్షిణ్యాలపైనే జీవితాలు ఆధార పడాల్సిన దుస్థితి ఏర్పడింది.. జీతాల పెంపు విషయం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా యాజమాన్యాలు వాటిని తుంగలో తొక్కి ఉద్యోగులు ఉసురు తీసుకుంటూనే ఉన్నాయి.. దీంతో సామాన్యుల బతికి ఎప్పటికీ సామాన్యంగానే ఉండిపోతోంది..