నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణి

కరీంనగర్: జిల్లాలో శుక్రువారం నులిపురుగుల నివారణ అల్బెండజోల్ మాత్రల పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ. రాజేశం తెలిపారు. గురువారం ఉదయం వారి కార్యాలయంలో జాతీయ నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న, ఆగస్టు 10న రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి ఈ మాత్రలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. పిల్లల ప్రేగుల్లో (నులిపురుగులు) నట్లలు చేరి పిలల్లు తీసుకునే ఆహరాన్ని అవి తీసుకొనుట వల్ల పిల్లలు రక్తహీనత, మందబుద్ది, పెరుగుదల లేక, చదువులో వెనుకబడి పోతారని అన్నారు. సంవత్సరానికి రెండు సార్లు ఈ మాత్రలు పిల్లలకు ఇవ్వడం వల్ల నులిపురుగులను నివారించవచ్చునని అన్నారు. ప్రపంచంలో 24 శాతం పిల్లలు నులిపురుగుల తో బాదపడుచున్నట్లు సర్వేలో తేలిందని అన్నారు. అందుకే ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. జిల్లాలో 1-19 సం!!ల పిల్లలు 2,09,372 ఉన్నట్లు గుర్తించామని అందుకు తగినన్ని మాత్రలు ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసిందని తెలిపారు. జిల్లాలో మాత్రలను అన్ని అంగన్ వాడి సెంటర్లకు, పాఠశాలలకు, కాలేజీలకు పంపించామని తెలిపారు. ఈ మాత్రలు మింగడం, చప్పరించడం వల్ల ఎలాంటి దుష్పలితాలు ఉండవని తెలిపారు. పెద్దలు కూడా ఈ మాత్రలు వేసుకోవచ్చునని తెలిపారు. అనారోగ్యంతో బాదపడుచున్న, కాన్సర్ వ్యాధి సోకిన పిల్లలకు ఈ మాత్రలు వేయవద్దని సూచించారు. శుక్రువారం తప్పిపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 15న వారికి మాత్రలు పంపిణి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటి డిఎమ్ ఎండ్ హెచ్ ఓ డాక్టర్: రవీందర్, డాక్టర్: పవన్ కుమార్, కోఆర్డినేటర్ పి.సాహితి, డాక్టర్: డెమో దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *