Breaking News

గ్రేటర్ లో టీఆర్ఎస్ గ్రేట్

trs car

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది.. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డ 50 ఏళ్లలో తొలిసారి ఒక పార్టీ మెజార్టీ సాధించింది అన్ని పార్టీలను సింగిల్ డిజిట్ కే పరిమితం చేసి మహా విజయం సాధించింది.. టీఆర్ఎస్ ధాటికి ప్రత్యర్థి ప్రతిపక్షాలు చిత్తుచిత్తుగా ఓడాయి.. ఏ పార్టీకి దక్కని అపూర్వ విజయం టీఆర్ఎస్ సాధించింది.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడిన టీఆర్ఎస్ .. ఇప్పుడు ఏకంగా గ్రేటర్ పీఠాన్ని అధిరోహించడం.. రాజకీయాల్లోనే పెను సంచలనం..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. దీనిలో మొత్తం 150డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ కారు అందరికంటే స్పీడుగా దూసుకెళ్లింది.. టీఆర్ఎస్ 99, మిత్రపక్ష మజ్లిస్ 44, కాంగ్రెస్ 2, బీజేపీ 4, టీడీపీని 1 స్థానానికే పరిమితం చేసింది.. రాష్ట్ర చరిత్రలోనే ఇదో పెను సంచలనం..కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఘోరంగా ఓడిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది.. చరిత్రను తిరగరాస్తూ టీఆర్ఎస్ సాధించిన ఈ విజయం నభూతో నభవిష్యతి..
కాగా ఈ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహ చతురత.. కేటీఆర్ ప్రచార ఆర్భాటం రెండు కలిసివచ్చి టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది.. ఇంతటి అద్భుత విజయంలో కీరోల్ ముఖ్యంగా కేటీఆర్ దే.. నాన్న కేసీఆర్ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించి భవిష్యత్తులో పార్టీని, ప్రభుత్వాన్ని నడపగల సామర్థ్యం తనకుందని నిరూపించుకున్నారు. ఈ గెలుపుతో తెలంగాణలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు నూకలు చెల్లినట్టైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *