
మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ లు తరలిపోయేలానే ఉన్నాయి. ఆ రాష్ట్ర హైకోర్టు మహారాష్ట్ర లో ఏర్పడ్డ తీవ్ర కరువు నేపథ్యంలో నీటికొరత దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ సాధ్యం కాదని దాదాపు 13 మ్యాచ్ లను తరలించాలని ఆదేశించింది. దీంతో బీసీసీఐ ఇరకాటం పడింది. అన్ని పూర్తయ్యాక కరువు అని తరలించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా బీసీసీఐ మహారాష్ట్రలో కరువు దృష్ట్యా మహా సర్కారుకు ఆర్థిక సాయం చేస్తామని నీటిని తరలిస్తామని హామీ ఇచ్చినా కూడా సర్కారు మహారాష్ట్రలో మ్యాచ్ ల నిర్వహణ వద్దంటూ స్పష్టం చేసింది. దీంతో పాటు హైకోర్టు కూడా ఆదేశించడంతో ఇప్పుడు ఇక మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ లు లేనట్లే..