Breaking News

నీతి ఆయోగ్ కు ఆర్థిక వేత్త సారథ్యం

ArvindPanagariya380PIB

ప్లానింగ్ కమిసన్ స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ కార్యవర్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నియమించారు. ప్రసిద్ధ ఆర్థిక వేత అరవింద్ పనగరియాను ఉపాధ్యక్షుడిగా నియమించారు. భారతీయ అమెరికన్ అయిన అరవింద్, స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతిచ్చే పనగరియా వయసు 62 ఏళ్లు. ఆయనకొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయోగ్ శాశ్వత సభ్యులుగా వీకే సారస్వత్, వివేక్ దేబ్రాయ్ లను నియమించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, సురేష్ ప్రభు, రాధా మోహన్, అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, ధావర్ చందర్ నియమితులయ్యారు.

ఉపాద్యక్షుడిగా నియమితుడైన అరవింద్, గతంలో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంగ్ చీఫ్ ఎకానమిస్టుగా పనిచేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ లో అనుసరించిన తరహా అభివృద్ధి మోడల్ ను ఆయన సమర్థిస్తారు. మొదటి నుంచీ ఆయన గుజరాత్ మోడల్ మద్దతుదారు. శాశ్వత సభ్యులుగా నియమితులైన వారిలో దేబ్రాయ్ కూడా ఆర్థిక వేత్త. సారస్వత్ సైంటిస్ట్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *