
ఎండాకాలం పోయింది.. వానాకాలం ప్రవేశం ఘనంగా చాటింది.. ఓ మోస్తారుగా వానలు కొట్టి వెళ్లిపోయాయి.. ఇక అప్పటి నుంచి చినుకు జాడ కరువైంది.. రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల నుంచి అటు నుంచి అటే హిమాలయాల వరకు విస్తరించి ఇక అక్కడే తిష్ట వేశాయి.. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది..
రైతులు వానల కోసం ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.. వానమ్మా రావమ్మా అంటూ అర్థిస్తున్నారు..ఎండిపోతున్న పంటలు రైతు గుండెలలో బడబాగ్ని రగిలిస్తున్నాయి.. పెట్టుబడులు రావేమోనని ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.. విత్తనాలు వేయని రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు..
మరోవైపు వర్షాలు లేక జలశయాలు అడుగంటాయి.. ఉన్నపాటి కొద్దిపాటి నీళ్లని పుష్కరాల కోసం విడుదల చేయడంతో ఇక నీళ్లు లేక ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి వచ్చేశాయి.. వర్షాలు కురవకపోతే ప్రజలకు తాగడానికి కూడా కానకష్టం అవుతుంది.. నీటి యుద్ధాలు జరిగినా జరగొచ్చు.. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, మానేరు డ్యాంలు వట్టిపోయాయి.. తాగడానికి కూడా నీరు అందించలేని డెడ్ స్టోరేజీకి పడిపోయాయి.. దీంతో ఇప్పుడు వర్షాల కోసం ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం.. ఇలాగే కొనసాగితే వచ్చే ఎండాకాలం నీటి యుద్ధాలు జరగొచ్చు..