నీటి కోసం ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు

rasamay

నీటికోసం జనం రోడ్డెక్కారు.. కరీంనగర్-వరంగల్ ప్రదాన రహదారిలోని మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద ప్రజలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తమకు నీటి వసతి కల్పించాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అదే రూట్ లో వెళుతున్న మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు..

01

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకొని తాగునీటికోసం ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామని.. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.. దీంతో ఎమ్మెల్యే హామీ మేరకు ప్రజలు ఆందోళన విరమించారు. కాగా జనం రాస్తారోకో చేయడంతో వరంగల్, కరీంనగర్ రహదారి వెంట భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *