
-సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీనే లేకుండా చేస్తానని కలలు గంటున్న తెలంగాణ ముఖ్యమంత్రికి అది నెరవేరదని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలించకుండా మంది మాటలు దొంగచాటుగా వింటున్నాడని విమర్శించారు. హైదరాబాద్ లోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనపై , ఆయనపై మోత్కుపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ లో మంత్రులుగా ఉన్నవారందరూ టీడీపీ నుంచే వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.