నిల‌బ‌డి ప‌నిచేస్తే ర‌క్త‌నాళాల‌కు ముప్పు

– డాక్ట‌ర్ రాజా, ఏవిస్ హాస్పిట‌ల్స్‌, 9908677715
హైద‌రాబాద్ః దీర్ఘ‌కాలం కూర్చొని లేదా నిల‌బ‌డి ప‌నిచేసేవారికి ర‌క్త‌నాళాలు ఉబ్బిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఏవిస్ హాస్సిట‌ల్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ప్ర‌ముఖ కాన్స‌ర్‌, ర‌క్త‌నాళాలు, స్త్రీల వ్యాధి నిపుణులు డాక్ట‌ర్ రాజా వి.కొప్ప‌ల హెచ్చ‌రించారు. ఇటీవ‌లి కాలంలో ర‌క్త‌నాళాల వాపుతో బాధ‌ప‌డేవారి సంఖ్య పెరుగుతున్న నేప‌ధ్యంలో డాక్ట‌ర్ రాజా ప్ర‌త్యేక స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేశారు. శ‌రీర భాగాల నుంచి గుండెకు ర‌క్తాన్ని తీసుకుపోయే ర‌క్త‌నాళాలు (సిర‌లు)లోని క‌వాటాలు ఒకే దిశ‌లో ర‌క్తప్ర‌వాహాన్ని అనుమ‌తిస్తాయి. అయితే క‌వాటాలు స‌రిగా ప‌నిచేయ‌నందున ర‌క్తం వెనుక‌కు ప్ర‌వ‌హించ‌డం, ఆ క్ర‌మంలో ర‌క్తం గూడుక‌ట్టుకొని ర‌క్త‌నాళాలు ఉబ్బిపోవ‌డం జ‌రుగుతుంది. సాధార‌ణంగా తొడ‌, పిక్క భాగాల‌లో ఇలా జ‌రుగుతుంద‌ని డాక్ట‌ర్ రాజా తెలిపారు. దీనివ‌ల్ల నొప్పి,బ‌రువు, అల‌స‌ట క‌లిగి రోజురోజుకూ పెరుగుతుంటాయి. ఎక్కువ సేపు నిల‌బ‌డ‌లేక‌పోవ‌డం, ఎత్త‌యిన ప్ర‌దేశంలో కాళ్లుపెట్టుకోవాల‌ని అనిపించ‌డం జ‌రుగుతుంది.
కొంత‌మందిలో ర‌క్త‌నాళాలు ఉబ్బిన‌ట్లుకూడా క‌నిపించ‌క‌పోయినా ఈ స‌మ‌స్య ఉంటుంది. మ‌రికొంత‌మందిలో మ‌డ‌మ ద‌గ్గ‌ర చ‌ర్మం చిట్లిన‌ట్లు, న‌ల్ల‌టి మ‌చ్చ‌లు క‌నిపిస్తాయి. యుక్త‌వ‌య‌స్సు దాటిన వారిలో సాధార‌ణంగా 15 నుండి 25 శాతం మందికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.60 ఏళ్లు దాటిన‌వారిలో ఒక శాతం మందికి మాత్రం పుండ్లు, అల్స‌ర్‌లు వ‌స్తాయ‌ని డాక్ట‌ర్ రాజా తెలిపారు. కుటంబంలో ఎవ‌రికైనా ఇటువంటి స‌మ‌స్య ఉన్నా, స్త్రీల గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యం, అధిక సంతానం ఉన్న‌వారిలో ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌న‌లో తేలింది. డ్యూప్లెక్స్ అల్ట్రాసౌండ్ అనే విధానంతో ఈ వ్యాధిని గుర్తిస్తారు.
అల్ట్రాసౌండ్ గైడెన్స్ అనే ప‌ద్ధ‌తి ద్వారా కేధ‌ట‌ర్ అనే స‌న్న‌ని గొట్టాన్ని సిర‌ల్లోకి పంపించి. లేజ‌ర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ ఎన‌ర్జీని ఉప‌యోగించి చికిత్స చేసి లోప‌ల ఉన్న మంచి ర‌క్త‌నాళాల‌ను కాపాడ‌వ‌చ్చున‌ని రాజా తెలిపారు. ఏంజియోప్లాస్టీ, స్టెంటింగ్ చేసే సౌక‌ర్యం త‌మ ఎవిస్ ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక‌మ‌ని ఆయ‌న చెప్పారు. వీటివ‌ల్ల త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని, వెయిన్ ఎబ్లేష‌న్ వ‌ల్ల 97 శాతం మంది వ్యాధి విముక్తుల‌య్యార‌ని వివ‌రించారు. ఈ శ‌స్త్ర‌చికిత్ప పూర్త‌యిన వెంట‌నే ఇంటికి వెళ్లిపోవ‌చ్చున‌ని ఆయ‌న తెలిపారు. లావెక్కిన ర‌క్త‌నాళాల‌కు చిన్న‌గాటు ద్వారా, ప్ర‌త్యేక ప‌రిక‌రాలు ఉప‌యోగించి వాటిని తొల‌గించే మైక్రోఫిలిబిక్ట‌మీ చికిత్స లేదా స‌న్న‌ని సూది ద్వారా వ్యాధి సోకిన న‌రాల‌లోకి ఒక ర‌క‌మైన ద్ర‌వాన్ని ఎక్కించి, ఆ ర‌క్త‌నాళాలను కుచించుకుపోయేలా చేసే ఇన్‌జ‌క్ష‌న్ స్ల్కేరోధెర‌పీ అనే చికిత్స కూడా చేయ‌వ‌చ్చున‌ని డాక్ట‌ర్ రాజా తెలిపారు.
వ్యాధిని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని.ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోద్య ప‌రీక్ష‌ల ద్వారా ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఇత‌ర వివ‌రాల‌కు 9908677715 నెంబ‌రులో సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని డాక్ట‌ర్ రాజా తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *