నిరుద్యోగుల గోస పట్టదా.?

kcr unemploye

అంగన్ వాడీలకు జీతాలు పెంచారు.. ప్రజాప్రతినిధులకు మూడింతల జీతం ఇచ్చారు. పోలీసులకు ప్రత్యేక వాహనాలు ఇచ్చారు. ప్రజాసంఘాలు, కళాకారులకు ఉద్యోగాలిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ భారీగా పెంచారు. అన్నీ చేశారు. కానీ నిరుద్యోగుల ఆశల్ని నీరుగార్చారు.

తెలంగాణ ఆశగా, శ్వాసగా ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థిలోకానికి ఉద్యోగాలివ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తోంది. కమలనాథన్ లెక్క తేలాలి.. ఉద్యోగాలివ్వాలి అంటోంది. ఉద్యమంలో తోడ్పాటునందించిన విద్యార్థులు మొదటినుంచి కోరుతున్నది ఒక్కటే.. అవే మన ఉద్యోగాలు మనకే.. కానీ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల్ని నెరవేర్చడం లేదు.

అందుకే ఈ శాసనసభాసమావేశాలు జరుగుతున్న వేళ విద్యార్థి లోకం చలో అసెంబ్లీతో ఓయూ యూనివర్సిటీలో కదం తొక్కింది. నిరసనగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. కేసీఆర్ మాయమాటలు కట్టిబెట్టి తమకు ఉద్యోగాలివ్వాలని నినదిస్తోంది. ఇప్పటికైనా తెలంగాణ నిరుద్యోగుల గోసను ఆలకించూ కేసీఆర్ సారూ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *