
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం దాదాపు 25000 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించనుంది. ప్రభుత్వ శాఖలు మంగళవారం ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందజేశాయి. ఈ సమావేశంలో నిరుద్యోగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును ఇవ్వనున్నారు.
ఈ ఉద్యోగాల్లో ఎక్కువగా 10వేల వరకు పోలీస్ ఉద్యోగాలే ఉండనున్నాయి. అందులో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . ఆ తర్వాత వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ ల కోసం ఇంజనీర్ పోస్టుల సంఖ్యను భారీగా రిక్రూట్ చేయనున్నారు. దీంతో నిరుద్యోగులు ఇప్పటి నుంచే సిద్దం కండి.. దాదాపు 10 ఏళ్ల తర్వాత భారీగా ఉద్యోగాలు భర్తీ కానుండడంతో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది వయసు దాటిపోయిన వయోపరిమితి సడలింపుతో అందరికీ అవకాశం దక్కనుంది.