Breaking News

నిరుద్యోగులకు ప్రభుత్వ రుణాలిస్తాం..

Eetela-Budget-121

మంచిర్యాల : నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లక్షనుంచి 10 లక్షల వరకూ సబ్సిడీ రుణాలందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంచిర్యాల, రామగుండంలలో పర్యటించిన ఈ టల ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు..

సబ్సిడీ రుణాల్లో నిరుద్యోగులకు 80వేల నుంచి 5 లక్షల వరకూ రాయితీ ఇస్తామని ఈటల తెలిపారు.. త్వరలో సర్కారు దీనికోసం కొత్త పథకాన్ని తెస్తోందని తెలిపారు. బ్యాంకు రుణాల్లో బ్రోకర్లను నమ్మవద్దని.. లంచాలు ఎవరికీ ఇవ్వవద్దని పారదర్శకంగా రుణాలను అందిస్తామని ఈటెల భరోసా ఇచ్చారు. అలాగే మూడేళ్లలో తెలంగాణలోని ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *