నిరుద్యోగులకు పదేళ్ల సడలింపు ఇస్తాం..

employees

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 నెలలు గడుస్తోంది. ఉద్యమంలో ఉప్పొంగిన విద్యార్థి లోకం ఇప్పుడు ఆశగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరాశ నిసృహలో కూరకుపోతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కాగా ఇదే విషయం శనివారం అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఉద్యోగాలు, టీచర్ల రేషనలైజేషన్ , డీఎస్సీపై ప్రశ్నించాయి. కాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వీటిపై సుధీర్ఘ వివరణ ఇచ్చారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉద్యోగుల విభజన ఇంకా జరగలేదని.. ఉద్యోగులను విభజించాక ఎంత మంది ఖాళీలు ఉన్నాయో పరిశీలించి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  ఉద్యోగాల కోసం డీఎస్సీ వేయమని.. కేవలం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *