Breaking News

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

telangana un employs

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురును అందించింది.. నిన్న జరిగిన ఉపాద్యాయ దినోత్సవంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మే నెల లోపు తెలంగాణలో కొత్త డీఎస్సీ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉపాధ్యాయ స్థానాల్లో 8000కు పైగా విద్యావలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ హేతుబద్దీకరణతోొ తెలంగాణలో దాదాపు 8వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కతేలిందన్నారు. అత్యధికంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్ ల్లో 1000 పోస్టులకు పైగా ఖాళీలున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 350కి పైగా ఖాళీలున్నట్లు పేర్కొన్నారు.

విద్యావలంటీర్ల గడువు ఏప్రిల్ లోపు ముగియడంతో జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వేయనున్నట్లు తెలిపారు. ప్రక్రియ మేలో పు పూర్తయ్యి జూన్ లో పాఠశాలలు ప్రారంభం అయ్యేలోగా టీచర్ల భర్తీ పూర్తవుతుందని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *