Breaking News

నియోజకవర్గాల బాధ్యతలు మంత్రులు

TRS-plenary_LB stadium

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు సహా జిల్లా అధ్యక్షులు దాదాపు ప్రతీ టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ ను దక్కించుకునేందుకు భారీ స్కెచ్ వేశారు..

హైదరాబాద్ లోని ప్రతీ నియోజకవర్గానికి ఒక మంత్రిని బాధ్యున్ని చేశారు. ఆ మంత్రి తనకు కేటాయించిన నియోజకవర్గంలో అందుబాటులో ఉండి.. ఒక డివిజన్ ను ఎంపిక చేసుకొని ప్రచారం చేయాలి. ఇక టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రతీ డివిజన్ కు ఒకరిని చొప్పున కేటాయించి ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా సంవత్సరం న్నర టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రతీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం చేయాలని అనక తీర్పును ప్రజలకే వదిలేద్దామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞలని వారి టీఆర్ఎస్ నే గెలిపిస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రాప్రజల బాధ్యత కూడా టీఆర్ఎస్ దేనని.. హైదరాబాద్ లో ఉన్నవాళ్లందరిని కన్నబిడ్డల్లా చూసుకుంటామని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *