Breaking News

నియోజకవర్గాల పునర్విభజన లేనట్టే..

kcr-in-delhi

ఢిల్లీ, ప్రతినిధి : తెలంగాణలో నియోజికవర్గాలను 156కు పెరుగుతాయని ఆశపడ్డ సీఎం కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హెచ్.ఎస్. బ్రహ్మ. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో శనివారం ఆయనను కలిసి నియోజకవర్గాల పునర్విభజనపై విన్నవించారు. తెలంగాణలో 156 అసెంబ్లీ సెగ్మెంట్ చేయాలని కోరారు.

కాగా ఏపీ, తెలంగాణలో రాష్ట్రాల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ ఇప్పట్లో చేయమని ఎలక్షన్ కమిషన్ తేల్చిచెప్పింది. 2026 వరకు డీ లిమిటేషన్ చేయవద్దని తమకు కేంద్రం లెటర్ రాసిందని ఈ మేరకు ఇప్పట్లో నియోజకవర్గాలను విభజించే సమస్యలేదని చెప్పారు. దేశం మొత్తం ఒకసారి 2026లోనే చేస్తామని.. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ గా చేయమని కేసీఆర్ స్పష్టం చేశారు.

కాగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి తెలంగాణలో 156 నియోజకవర్గాలు పెరుగుతాయని అందరికీ అవకాశం సీట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో నాయకులు కూడా సంబరపడ్డారు. కానీ కేంద్రం మోకాలడ్డడంతో నాయకుల్లో కంగారు మొదలైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *