
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు 400 చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు అయినట్లు రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం సమావేవ మందిరంలో జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యేలు, అధికారులతో డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరుపై నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు అన్ని జిల్లాలకు ంజూరు చేసిందని కరీంనగర్ జిల్లాకు 5200 ఇండ్లు మంజూరు చేసిందన్నారు. గతంలో ఇంటికి 70-80వేల ఇచ్చేవారని.. తమ ప్రభుత్వం పేదల కోసం ఇంటికి 50400 కేటాయించి పూర్తిగా నిర్మించి ఇస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూమిని గుర్తించి టెండర్ నిర్వహించి పూర్తి చేసి నిర్మాణాలు చేపడతారని తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సూచన మేరకు గుడిసెల్లో ఉన్న వారికే ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాల పక్కనే నిర్మిస్తామని, పట్టణాల్లో స్థలాలు కొని కడుతుందని చెప్పారు.