నిమ్స్‌ని సంద‌ర్శించిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

నిమ్స్‌ని సంద‌ర్శించిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

నిమ్స్‌లో త్వ‌ర‌లో మ‌రిన్ని వైద్య సేవ‌లు

స్టెమ్ సెల్, సెంట్ర‌ల్ ల్యాబరేట‌రీ యూనిట్ల ప‌రిశీల‌న‌

ప‌లువురు పేషంట్ల‌కు ప‌రామ‌ర్శ‌

హైద‌రాబాద్: నిమ్స్‌లో మ‌రిన్ని వైద్య సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా సెంట్ర‌ల్ ల్యాబరేట‌రీ సిస్ట‌మ్‌ని, స్టెమ్ సెల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ రెండు విభాగాల ద్వారా నిమ్స్ వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు మెరుగ‌వుతాయ‌న్నారు. గురువారం మంత్రి పంజాగుట్ట‌లోని నిమ్స్‌ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నిర్మాణంలో ఉన్న స్టెమ్ సెల్ – రీసెర్చ్ ఫెసిలిటీ, బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేష‌న్ గ‌దుల‌ను, సెంట్ర‌ల్ ల్యాబ‌రేట‌రీ విభాగాల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మంత్రి, నిమ్స్‌లో ఇప్ప‌టికే అనేక వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు.  తాజాగా మ‌రికొన్ని సేవ‌ల‌ను విస్తృతం చేయ‌నున్నామ‌న్నారు. ఆయా విభాగాలు పూర్త‌యితే మంచి మెరుగైన సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందుతాయ‌న్నారు. స్టెమ్ సెల్ – రీసెర్చ్ ఫెసిలిటీ, బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేష‌న్, సెంట్ర‌ల్ ల్యాబ‌రేట‌రీ విభాగాల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా నిమ్స్ ఎమ‌ర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతున్న జ‌డ్చ‌ర్ల‌కు చెందిన రామ‌స్వామి, మిడ్జిల్ కు చెందిన స‌ద్దాం హుస్óన్‌, నాగ‌ర్‌క‌ర్నూలుకు చెందిన బాల‌య్య‌, చిన రేవ‌ల్లెకు చెందిన మ‌హేశ్వ‌ర‌రావుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న చికిత్స‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని నిమ్స్ డైరెక్ట‌ర్‌, సిబ్బందిని అదేశించారు.  ఈ సంద‌ర్భంగా నిమ్స్‌లో జ‌రుగుతున్న ప‌లు ప‌నుల పురోగ‌తిని మంత్రికి వివ‌రించారు డైరెక్ట‌ర్ మ‌నోహ‌ర్‌. అలాగే త్వ‌ర‌లో పిజీ హాస్ట‌ల్ ఆధునీక‌ర‌ణ ప‌నులు కూడా చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు. నిమ్స్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ నిమ్మ‌, డీన్ సుభాష్ కౌల్ త‌దిత‌రులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *