
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కేసీఆర్ పై పడ్డాడు. గడిచిన రెండు ఆదివారాలు తన పత్రికలో రాసే కొత్త పలుకులో కేసీఆర్ ను చీల్చిచెండాడాడు.. విశేషమేంటంటే ఇందులో ఏపీలో సమస్యలేలేనట్టు, ఏపీ సీఎం చంద్రబాబు సక్కని పూస అయినట్టు ఒక వ్యాఖ్యం కూడా రాయకపోవడం గమనార్హం. ఎంత చంద్రబాబు సాకితే మాత్రం ఆయనను నెత్తిన పెట్టుకొని కేసీఆర్ ను చడామడా తిట్టేయడం ఏం బాగా లేదంటున్నారు చదివినవాళ్లు..
ఏబీఎన్ ను తెలంగాణలో నిషేధించిన కేసీఆర్ ను టార్గెట్ గానే ఈ కొత్త పలుకులు పలికాడని టీఆర్ఎస్ వర్గీయులు విమర్శిస్తున్నారు. ఇలా అయితే ఇంకో నాలుగేళ్లు ఏబీఎన్ తెలంగాణలో రాదంటున్నారు.
రాధాకృష్ణ తెలంగాణ సమస్యలు, కేసీఆర్ వైఫల్యం అన్నట్టు మొత్తం తెగరాసేస్తున్నాడు కానీ అసలు ఏపీలో జరుగుతున్న బాగోతాన్ని వెలికితీయడం లేదు. మొన్న విశాఖలో డ్రైనేజీలో పడి బాలిక చనిపోతే అన్ని మీడియాలు ప్రభుత్వ వైఫల్యంపై దుమ్మెత్తాయి.. కానీ రాధాకృష్ణ నోరు మెదపలేదు. పోలవరం, పట్టిసీమలో కాంట్రాక్టుల్లో వేల కోట్లు చేతులు మారుతున్న ఆంధ్రజ్యోతిలో వార్త రాదు.. ఎందుకంటే బాబు బాగోతం కాపాడడమే ఆయన ఉద్దేశం..
అందుకే ఏపీలో జరిగేది అభివృద్ధి.. తెలంగాణలో జరిగేది దోపిడీ అంటూ లేని జర్నలిజాన్ని బాబుప్రేమను కేసీఆర్ కోపాన్ని ప్రధర్శిస్తున్నారు రాధాకృష్ణ…
కొత్త పలుకులో రెండు పేద్ద వ్యాసాలు రాసిన రాధాకృష్ణ.. అందులో కేసీఆర్ పైనే కానీ.. చంద్రబాబుపై ఇసుమంతైనా లేదు.. అక్కడ ఏం జరగడం లేదా.. అవినీతి కనపడడం లేదా అని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.