నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు..

-దొంగే దొంగ దొంగ అన్నట్టుంది..
-అవినీతి చేసి దబాయిస్తున్నాడు..
-ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ నిప్పులు
దామరచర్ల :రేవంత్ రెడ్డి ‘ఓటుకు నోటు ’ కేసులో చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళగిరిలో తనపై విమర్శలు గుప్పించిన ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్గొండలో వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లో ఏపీ ఏసీబీ ఉందన్న చంద్రబాబు.. తాను మాత్రం నీలా దొంగను కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నీ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. పట్టపగలు నగ్నంగా దొరికిపోయిన దొంగవు.. ఇంకా నివ్వు మాట్లాడేదేముందని నిలదీశాడు..

‘పక్కరాష్ట్రం వోడివి మా రాష్ట్రం మా ఎమ్మెల్యేలను కొంటే గాజులు వేసుకొని కూర్చోవాలా.. బిడ్డ ఇది తెలంగాణ రాష్ట్రం.. నీ ఆటలు ఇక్కడ సాగవు అని మండిపడ్డారు. మా తెలంగాణ బిడ్డ స్టీఫెన్ సన్ నీ బండారం బట్టబయలు చేశాడని మండిపడ్డారు.గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బాగోతం బయటపడిందని.. ఈ గడ్డపై కిరికిరి చెల్లదని స్పష్టం చేశారు.

అంతకుముందు తెలంగాణ వాటర్ గ్రిడ్, దామరచర్ల ఎన్టీపీసీ కరెంట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణా నీళ్లు తెచ్చి తెలంగాణ ఆడబిడ్డల కాళ్లు కడుగుతామని హెచ్చరించారు. వచ్చే 2019 వరకు తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తామన్నారు.

About The Author

Related posts