నిజామాబాద్ లో జ‌ర్న‌లిస్టుల గ‌ర్జ‌న వాల్ పోస్ట‌ర్‌,క‌ర‌ప‌త్రాల ఆవిష్క‌ర‌ణ‌ టీయుడ‌బ్ల్యూజె (ఐజెయు)

నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్య‌ర్య‌లో శ‌నివారం స్థానిక ప్రెస్ క్ల‌బ్‌లో జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంకై ఈ నెల 28న రాష్ట్ర శాఖ త‌ల‌పెట్టిన జ‌ర్న‌లిస్టుల గ‌ర్జ‌నకు సంబంధించిన వాల్ పోస్ట‌ర్‌లు,క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించారు.యూనియ‌న్ రాష్ట్ర కోశాధికారి మ‌హిపాల్ రెడ్డి ముఖ్యాతిథిగా హాజ‌రై మాట్లాడుతూ ఎన్నిక‌ల మెనిఫెస్టోలో కేసిఆర్ పెర్కొన్న‌జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ళ స్థ‌లాలు,డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ళు,అంద‌రికీ వైద్యం, ప్ర‌తి ఒక్క జ‌ర్న‌లిస్టుకు అక్రిడిటేష‌న్‌లు అందిస్తామ‌న్న హామిని వెంట‌నే ప‌రిష్క‌రించి జీవో రూపంలో విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్ళ‌యినా సిఎం కేసిఆర్ జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోగా ప‌ట్టించుకున్న పాపానాపోలేద‌ని విమ‌ర్శించారు. కావున ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై పెద్ద ఎత్తున చ‌లో హైద‌ర‌బాద్ జ‌ర్న‌లిస్టుల‌ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మాన్ని బాగ్ లింగంప‌ల్లిలోని ఆర్టీసీ క‌ళ్యాణ మండ‌పంలో ఏర్పాటు చేసిన‌ట్లు అంత‌కు ముందు సుంద‌రయ్య విజ్ఞాన కేంద్రం నుండి స‌భా ప్రాంగ‌ణం వ‌ర‌కు పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న జ‌రుప‌నున్న‌ట్లు చెప్పారు. కావున జిల్లాలోని జ‌ర్న‌లిస్టులంతా పెద్ద సంఖ్య‌లో జ‌ర్న‌లిస్టుల గ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో టీయుడ‌బ్ల్యూజె (ఐజెయు) నిజామాబాద్ జిల్లా శాఖ అధ్య‌క్షులు అంగిరేకుల సాయిలు,జిల్లా కార్య‌ద‌ర్శి మ‌ల్లెపూల లింబాద్రి,కోశాధికారి సిరిగాద ప్ర‌సాద్‌,జిల్లా ఉపాధ్యక్షులు ర‌త‌న్ రెడ్డి, జాయింట్ సెక్ర‌ట‌రీ ఆంజ‌నేయులు, రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యులు పి.దేవిదాస్‌(టివి-9)సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి(మ‌న తెలంగాణ‌) ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్య‌క్షులు బైర శేక‌ర్ (టివి-5),ఫోటోగ్రాఫ‌ర్‌ల సంఘం అధ్య‌క్షులు రాజ్‌కుమార్‌(సాక్షి),గౌర‌వాధ్య‌క్షులు గోవింద్ రాజు(స‌హారా), ఉర్దూ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్యక్షులు అహ్మ‌ద్ ఆలీ ఖాన్‌,చిన్న‌,మ‌ధ్య‌త‌ర‌హా ప‌త్రిక‌ల జిల్లా నాయ‌కులు దేవిదాస్‌(ఆయుధం),జిల్లా కార్య‌వ‌ర్గ స‌భ్యులు న‌రేంద‌ర్‌,వీడియో జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులు పి.శ్రీ‌కాంత్‌(టిటిడి టివి), సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు దుర్గం జ‌గ‌న్‌,రాజేష్ (ఐ న్యూస్‌),మ‌హేంద‌ర్ (మ‌హా టివి),ప్ర‌మోద్ (వార్త‌),మండె మోహ‌న్ (స్నేహా టివి),ప్ర‌సాద్ (అక్ష‌రం),ర‌వి బాబు (విశాలాంధ్ర‌),ఎల్‌.ర‌వి కుమార్ (ఆంధ్ర‌భూమి),మ‌ల్లెపూల న‌ర్స‌య్య‌(సాక్షి),శ్రీ‌నివాస్‌,వివేక్‌,శ్రీ‌కాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *