నిజాం బాధితుడు కేసీఆర్ కాదు కదా.?

-ఓట్లే ఆయనకు ముఖ్యం..?
-అందుకే నిజాం నిరంకుశం ఆయనకు కనపడటం లేదు..
-మండిపడుతున్న బీజేపీ నేతలు
హైదరాబాద్, ప్రతినిధి : నిజాం మంచోడా..? తెలంగాణను మంచిగా పాలించాడా? కేసీఆర్ చెప్పినట్టు ప్రాజెక్టులు , రైల్వేలు, హైదరాబాద్ ను అభివృద్ధి చేశాడా.? మరి ఇతర ప్రభుత్వాల నేతలు విమర్శలెందుకు చేస్తున్నారు?

నిజాం నిరంకుశం తెలంగాణ గోస పడ్డ ప్రతీ పల్లెను చూసినా తెలుస్తోంది. నిజాం రజాకర్ల చేతిలో మాన భంగాలకు గురైన మహిళలను అడిగితే చెబుతారు.. పట్వార్ల, దొరల పెత్తనంతో బడుగు, బలహీన వర్గాలు ఎంతో హింసబడ్డారో తెలుస్తది.. చదువుల విషయంలో తెలంగాణను అథపాతాళానికి గురిచేసిన నిజాం ప్రభువులు.. వారి హయాంలో తెలుగు పాఠశాలలే లేకుండా చేశారు. జనం చదివుకుంటే తిరగబడతారని తెలిసే మన చదువుల్ని, జ్ఞానాన్ని ఎదగనీయకుండా చేశారు నిజాంలు.. అందుకే మన చదువులు ఆంధ్రాతో పోలిస్తే వందేళ్లు వెనక్కి ఉంటాయి.. అక్కడ ఇంగ్లీష్ మిషనరీ, బ్రిటీష్ పరిపాలనలో చర్చిల కింద చాలా మంది చదువుకున్నారు. కానీ తెలంగాణలో జనానికి పాఠశాలలు ఎక్కడ పెట్టించకుండా నిజాం ప్రభువులు అణగతొక్కారు. దీంతో మన తండ్రుల్లో చాలా మందికి ఇప్పటికీ చదువు రాదు.. మరి ఇంత ఘోరం జరిగిన గత తెలంగాణ చరిత్ర కేసీఆర్ కు ఎందుకు కనిపించలేదు..? ఆయనెందుకు నిజాంను కీర్తిస్తున్నాడు?

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలంటే నిజాంను కీర్తించాల్సిందే.. పైగా తెలంగాణలో ఎక్కువగా మైనార్టీ ఓట్లు పడాలంటే నిజాంను దేవుడు చేయాల్సిందే.. రాజకీయ ప్రయోజనాల కోసం నిజాం దుర్మార్గాలు కూడా మంచిగా కనపడుతున్నాయి మన నేతలకు… నిజాం హయాంలో ప్రపంచంలోనే ధనవంతులుగా వారు వర్ధిల్లారు. ఆ సంపద తెలంగాణ ప్రజల నెత్తూరులోంచి వచ్చింది కాదా? కోట్లు కొల్లగొట్టి కొన్ని మంచి పనులు చేస్తే నిజాం మంచోడు అయిపోతాడా ? అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు.. వారి సమాధానాలు.. అధికార టీఆర్ఎస్ వ్యాఖ్యలతో నిజాం మంచోడా చెడ్డోడా అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.