
తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్.. ముందుగా సీఎం మాట్లాడారు. ఆ తరువాత జానారెడ్డి సైతం ఏదోలా కలాంకు నివాళులంటూ పనిముగించారు.. ఇక ఎర్రబెల్లి వంతు వచ్చింది.. అప్పుడే ఆయన మాట స్లిప్ అయ్యారు..
కలాంకు రాష్ట్రపతి అవార్డు రావడం వెనుక చంద్రబాబు కృషి ఉందని.. కలాంగారిని రాష్ట్రపతిని నామినేట్ చేసింది బాబేనన్నారు. ఈ సందర్భంగా కలాంగారు మళ్లీ ఆంధ్రదేశంలోనే జన్మించాలని కోరుకుంటున్నా’ అని ఎర్రబెల్లి అన్నారు. ఇలా అనగానే సభలో కలకలం రేగింది.. ఆంధ్రదేశం ఏంటి అంటూ సభ్యులు నిలదీశారు.. సీఎం కేసీఆర్.. స్పీకర్ మధుసూదనాచారి సహా అందరూ నవ్వేశారు.. ఆ తరువాత ‘ఆ అదే తెలంగాణలోనే తెలుగు పౌరుడిగానే కలాం పుట్టాలి’ అని ఎర్రబెల్లి అనగానే సభలో ప్రశాంతత నెలకొంది..