
-మా దగ్గర ఏసీబీ ఉంది.. నీకు తడాఖా చూపిస్తా..
-కేసీఆర్ పై విజయవాడలో చంద్రబాబు నిప్పులు
మంగళగిరి: ‘ఏపీ సీఎం గా ఉన్న నా ఫోన్లు ట్యాప్ చేసే హక్కు కేసీఆర్ కు ఎక్కడిదని.. తానేమైనా కేసీఆర్ కు సర్వెంటునా అని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన ‘మహా సంకల్ప సభలో’ ఆయన మాట్లాడారు. తాను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి సీఎంను అయినా నన్నే అవమానించారని చంద్రబాబు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై తన కడుపు మండిపోతుందని ఆవేదన చెందారు.
రేవంత్ పై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. కేసీఆర్ కు తెలంగాణ జాగీరా అని మండిపడ్డారు. నా జీవితం మొత్తం నిజాయితీగా ప్రజా సేవా చేశానని నన్ను కేసీఆర్ అభాసుపాలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్ అసమర్ధుడని ఏమీ చేయలేక నామీద కుట్ర పన్నుతున్నాడన్నారు. మీరు హైదరాబాద్ లో ఉన్నారు. మా ఏసీబీ కూడా హైదరాబాద్ లోనే ఉందని మీ పనిచెబుతామని హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు నా దగ్గరున్నా అస్త్రాలు బయటపెడతా.. టీఆర్ఎస్ దయాదక్షిణ్యాలపై ఎవరూ ఆధారపడలేదు..