
ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు నిన్న వెళ్లిపోయారు. ఈ సారి ఆయన పోయింది అరబ్ దేశాలకు.. యూఏఈలో పర్యటించిన ఆయనకు అరబ్ రాజకుటుంబం మొత్తం కదిలివచ్చి ఘనస్వాగతం పలికారు.. కాగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఏడాది పాలనలో నెలకు కనీసం 2 నుంచి మూడు విదేశీ టూర్లతో ప్రపంచంలో, దేశంలో ఏ నేత చేయని పర్యటనలు చేస్తున్నారు.
నెలకు రెండు పర్యటనలతో దూసుకుపోతున్న మోడీ వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది.. ఆయన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆయన పాలన సగం విదేశాలనుంచే మానటరింగ్ చేస్తున్నారట..
ఆయన భారత్ కు ఒప్పందాలు చేసేందుకు వెళ్తున్నారో లేక టూర్ గా తిరగడానికి వెళ్తున్నారోనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. మరీ ఇంతలా టూర్లు పెట్టుకొని కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.