నా దగ్గర పనిచేసి.. నన్నే విమర్శిస్తావా..?

హైదరాబాద్ : టీఆర్ఎస్ వార్శికోత్సవ బహిరంగ సభలో ‘ఏపీ సీఎంకు ఇక్కడేం పని’ అని విమర్శించిన కేసీఆర్ కు ధీటైన సమాధానం ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. సోమవారం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ను నియమించి నియోజకవర్గ సమావేశం, జిల్లా సమీక్షలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రజల బాగోగులు చూడడం కోసమే తెలంగాణలో ఇంకా నివాసం ఉంటున్నామని చంద్రబాబు అన్నారు. టీడీపీ లేకపోతే తెలంగాణలో మళ్లీ దొరల , నిజాంల పాలన వస్తుందన్నారు. టీడీపీ ని చూస్తేనే కేసీఆర్ కు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని.. అందుకే తమపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ నా దగ్గరే ఒకనాడు పనిచేశారని ఆ విషయం గుర్తుపెట్టకొని మాట్లాడాలని చురకలంటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆనాడు పాఠాలు చెప్పిన కేసీఆర్ ఈరోజు ఇలా తననే విమర్శించడం బాధ కలుగుతోందని చంద్రబాబు అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *