నా చార్జింగ్ ఫ్యాన్, లైట్ ఖరాబు చేసిన కేసీఆర్

పోయినేడాది.. మార్చి నెల నుంచే మొదలైనయి.. కరెంటు కోతలు.. పగలు ఉండేది కాదు. రాత్రి 1 గంట నుంచి 3 గంటలవరకు 2 గంటలు కరెంటు తీసేటోల్లు.. దీంతో విసిగి వేసారిన..  చార్జింగ్ ఫ్యాన్  ను 2500/-, చార్జింగ్ లైట్ 300 పెట్టి కొన్నా.. కానీ ఈ రెండింటిని ఖరాబు చేసేశాడు సీఎం కేసీఆర్ సారూ.. పోయినేడాది కూడా ఇవి అక్కరకు వచ్చాయి.. వాడాం కూడా.. కానీ ఈ ఏడాది మార్చి నుంచి చూస్తున్నా వీటిని వాడుదాం.. వినియోగంలోకి తెద్దామని.. తీయనిస్తేగదా.. ఇప్పుడు కరాబ్ అయిపాయే.. పైసలు వేస్ట్ అయిపాయే..

పోయిన సీఎం  కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అంధకారం అయితదన్నడు.. గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ సారూ మూడేండ్లదాకా కరెంటు అడగద్దంటివి. ఇంకేముంది అందరూ చార్జింగ్ లైట్లు, ఫ్యాన్లు కొన్నారు. కొందరు మినీ జనరేటర్లు, ఇన్వర్టర్లు కొన్నారు. చార్జింగ్ కంపెనీలు, సోలార్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడి గా అమ్మినయి.. లాభపడ్డాయి. కానీ  ఇప్పుడివ్వన్ని  వాడతలేరు.. ఎందుకంటే కేసీఆర్ మూడేండ్ల అని పదినెలలకే ఫుల్లుగా కరెంటిత్తడని కలగన్నమా.. సోలార్ కంపినోళ్లు, ఇన్వర్టర్ కంపెనోళ్లు బతుకద్దా తెలంగాణలో.. ఇదేం పాపం కేసీఆర్ సారూ.. ఆంధ్రోళ్లు కూడా అసూయగా సూత్తున్నరు.. ఇంత జల్దిన కరెంటు కష్టాలు తీర్తవని ఎవరూ ఊహించలే.. జనాలు..

సూడు కేసీఆర్ సారూ.. ప్రజల కష్టాలను ఓట్ల ముందట తీర్చాలి. అప్పుడే కాంగ్రెసోళ్ల లెక్క రాజకీయ నాయకుడవుతవు.. గిట్ల గద్దెనెక్కిన పదినెలలకే కరెంటు సమస్యలు, పింఛన్లు, రేషన్ బియ్యం ఇలా అన్ని సక్కదిద్దితే పొలిటీషన్ కాలేవు నువ్వు.. దేవుడివైతవు.. అరె కొంచమన్న గెరువు ఇయ్యరాదే.. మొత్తానికి నా చార్జింగ్ లైట్, చార్జింగ్ ఫ్యాన్ ఖరాబ్ చేసినవ్ పో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *