నా కొడుకు జోలికొస్తావా.. నీ కొడుకుకు ఇస్తా..

ఆంధ్రా తెలంగాణ మధ్య మరో వైరం ముదిరింది. ఈ సారి సీఎంల స్థాయిలో కాకుండా వారి కుమారుల స్థాయిలో ఈ యుద్ధం జరుగుతోంది. బుధవారం జరిగిన ఓటుకు నోటు కేసు పరిణామాలు ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులు కేటీఆర్, లోకేష్ లపై పడ్డాయి.. దీంతో సై అంటే సై అనే స్థాయికి ఏపీ, తెలంగాణ పోలీసులు వెళ్లారు..

బుధవారం జరిగిన కీలక పరిణామాలను చూస్తే ఓటుకు నోటు కేసులో కదిలిక వచ్చింది. తెలంగాణ ఏసీబీ అధికారులు లోకేష్ డ్రైవర్ కు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముందు గురువారం హాజరుకావాలని సూచించారు.

కాగా దీనికి ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందించింది. ఏపీ పోలీసులు బుధవారం రాత్రి కేటీఆర్ గన్ మెన్ కు, కారు డ్రైవర్ కు నోటీసులు జారీ చేసేందుకు తెలంగాణ సచివాలయం వచ్చారు. ముత్తయ్య కాల్ డేటా కేసులో నోటీసులు జారీ చేేసేందుకు రాగా వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కేసీఆర్ ఇంటికి, పాత ఇంటికి వెళ్లగా అక్కడ అడ్డంకులే ఎదురయ్యాయి..

ఈ పరిణామాలు ఓటుకు నోటు కేసులో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.. పోటాపోటీ నోటీసులతో రాజకీయ వేడి రగులుకుంది.. కేటీఆర్ , లోకేష్ ల టార్గెట్ రాజకీయాలు గుబులు పుట్టిస్తాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.