Breaking News

నా కులం తక్కువనే కదా.. మీకు అలుసు..

Balka Suman

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో కలెక్టర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులపై మండిపడ్డారు. నా పేరు చివర రావు, రెడ్డి, శర్మ,లాంటివి లేకనే మిగతా వారికి ఇచ్చిన గౌరవం తనకు ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డారు. తనకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కలెక్టరేట్ లో సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఇలానే వ్యవహరిస్తే పార్లమెంటు లో కార్యదర్శి సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు..

ఇదిలా ఉంటే కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ డామినేషన్ ఎక్కువగా ఉందనే సుమన్ జీర్ణించుకోలేకపోతున్నారనట.. అందుకే రావులకు, రెడ్డిలకు ఇచ్చిన గౌరవం తనకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. వినోద్, రెడ్డి ఎమ్మెల్యే లు ఎస్ సీ అనే తనను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాగా ఈ విమర్శలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి..

ఉద్యమనాయకుడిగా వెలుగులోకి వచ్చిన సుమన్.. కాంగ్రెస్ ఎంపీ వివేక్ ను ఓడించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఫోకస్ కాకుండా పట్టించుకోకపోవడంతో సుమన్ ను ఎవరూ గుర్తించడం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *