
సిడ్నీ, ప్రతినిధి : భారత్ జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా వెళ్తోంది. ఆసీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ షాన్ మార్ష్ 86 బంతులు ఎదర్కుని, ఆరు బౌండరీలు ఓ సిక్సర్ సాయంతో అర్థ సెంచరీ సాధించాడు. కాగా క్రీజులోకి వచ్చే ప్రతీ బ్యాట్స్ మెన్స్ అర్థ సెంచరీ చేసిగానీ వెళ్లము అని కంకణం కట్టుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు క్రీజులోకి వచ్చిన ఆరుగురు బ్యాట్స్ మెన్స్ లో వార్నర్ 101, స్మిత్ 117 ఇద్దరు సెంచరీలు చేయగా, రోజర్స్ 95, వాట్సన్ 81, మార్ష్ 50 (నాటౌట్) ముగ్గురు అర్థ సెంచరీలు సాధించారు. కాగా రోజర్స్ 30 (నాటౌట్) అర్థ సెంచరీ వైపు దూసువెళ్తున్నాడు. భారత బౌలింగ్ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం, అక్కడక్కడ అందించ్చిన క్యాచెస్ ను నేల పాలు చేయడంతో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 488/4పరుగులతో ఆడుతోంది.