నాలుగేళ్లలో రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు పనులు

ntpc

ఎన్టీపీసీ సిఎండీ శ్రీ అరూప్ రాయ్, సంస్థ దక్షిణ ప్రాంత ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ శ్రీ ఆర్ వెంకటేశ్వరన్ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావుతో సోమవారం క్యాంపు ఆఫీసులో సమావేశమయ్యారు. రామగుండం వద్ద నిర్మించనున్న 4000 మెవా ప్లాంటును ఆం.ప్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణాకు కేటాయించడానికి ఎన్టీపీసీ ప్రతినిధులు అంగీకరించారు. ఈ పవర్ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని సరఫరా చేస్తామని, బొగ్గు లభ్యతపై తానే స్వయంగా ప్రధాన మంత్రితో మాట్లాడతానని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు.
రామగుండం ప్రాజెక్టును వచ్చే నాలుగేళ్ళలో పూర్తి చేస్తామని ఎన్టీపీసీ సీఎండీ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇంధన శాఖ మంత్రి శ్రీ జీ జగదీశ్ రెడ్డి, టీఎస్ జెన్కో సీఎండీ శ్రీ ప్రభాకర్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *