నాలక్ష్యం.. బంగారు తెలంగాణ

హైదరాబాద్ : 14 ఏళ్ల క్రితం జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ కేసీఆర్ పోరాటం.. చివరకు తెలంగాణ సాధించిందని.. ఇప్పుడు బంగారు తెలంగాణే తన లక్ష్యం అన్నారు సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్. టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం 14 వ వార్శికోత్సవ సభను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు కార్యకర్తల నుద్దేశించి ఆయన మాట్లాడారు.

kcr saba

ఉద్యమం కోసం తెలంగాణ సకలజనం పోరాడారని.. వారి పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. ఎన్నో ఆటంకాలు అధిగమించి, ఆంధ్రకుట్రలను చేధించి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ సాధించామన్నారు. ఈ క్రమంలో ఎంతోమంది అమరులు అసువుసులుబాసారన్నారు. శ్రీకాంతాచారి తనను కలిచివేసిందన్నారు. తాను ఎంతో ఏడ్చానని తెలిపారు. చావు అంచుల వరకు వెళ్లి తెలంగాణను సాధించామన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు,రాజకీయ నాయకులు కుట్రలు పన్ని తెలంగాణ ప్రకటనను కేంద్రం వెనక్కు తీసుకునేలా చేశారని పేర్కొన్నారు. కానీ కలలు కని సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే తన ధ్యేయమన్నారు.

బంగారు తెలంగాణలో మాటలుండవని.. చేతలు మాత్రమే ఉంటాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 గా ఉందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ సొమ్మును అప్పనంగా ఆంధ్రావారే భోంచేశారని ఇప్పుడు తెలంగాణకు మిగులు బడ్జెట్ తో అద్భుతాలు చేస్తామన్నారు.

మే నెల నుంచి పేదలకు డబుల్ బెడ్ రూంలు
మే నెల నుంచి డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇస్తామని సీఎం అన్నారు. నిరుద్యోగులు ఓపిక పట్టాలని రాబోయే రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి కేజీ నుంచి పీజీ విద్య అమలు చేస్తామన్నారు. రానున్న మే నెల నుంచి రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని ..తెలంగాణలో కరెంటు కోతలనేవే లేకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

సీఎం చంద్రబాబుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబు రుణమాఫీపై అక్కడి ప్రజలను మోసంచేశారని.. తాము మాత్రం అమలు చేశామన్నారు. త్వరలోనే తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చాకులా పనిచేస్తూ మిషన్ కాకతీయను పరుగులు తీయిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *