నారా రోహిత్ ‘సావిత్రి’ రెండవ షెడ్యూల్ ప్రారంభం 

యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం ‘సావిత్రి’. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మొదటి షెడ్యుల్ ను విజయవంతం గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ” ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మొదటి షెడ్యూల్ ని విజయవంతం గా పూర్తి చేసి, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని ఏలూరు పరిశర ప్రాంతాలలో నవంబరు 18 నుండి ప్రారంభిస్తున్నాం. రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం” అని  నిర్మాత డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ, ” ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నారా రోహిత్ తో ‘సావిత్రి’ చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది” అని అన్నారు.
ఈ చిత్రం 2016 ప్రధమార్ధం లో విడుదల అవుతుంది.
నటీనటులు :
నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవ, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ – వస్సంత్ , డైలాగ్స్ – కృష్ణ చైతన్య, సంగీతం – శ్రవణ్ , ఎడిటర్ – గౌతం నెరుసు , ఫైట్స్ – డ్రాగన్ ప్రకాష్
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం – పవన్ సాదినేని
ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ – జాబిల్లి నాగేశ్వర రావు
నిర్మాత – డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *