Breaking News

నారాయణను ఒక్క చెవితో నేను చూడలేను..

19-kcr-narayana

పంచ్ పఠాకలు పేల్చడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అందుకే సీపీఐ నేత నారాయణ గ్రేటర్ లో చేసిన విమర్శలకు గెలిచిన తర్వాత గట్టిగా సమాధానమిచ్చారు కేసీఆర్.. టీఆర్ఎస్ కు వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానన్న సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. గ్రేటర్ గెలుపు ఖాయం అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఈ సందర్బంగా నారాయణపై వ్యంగ్య వాఖ్యలు చేసి అలరించారు..

‘‘ నారాయణ నా మిత్రుడు.. టీఆర్ఎస్ గెలిస్తే చెవి కోసుకుంటా అన్నడు.. ఒక్క చెవితో ఆయనను నేను చూడలేను.. ఆయన జోలికి టీఆర్ఎస్ కార్యకర్తలెవరూ పోవద్దు..ఆ ప్రజానేతను ఇక నుంచైనా మంచిగా మట్లాడితే మంచింది..ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి.. స్వాగతిస్తాం.. అమలు చేస్తాం.. వరంగల్, గ్రేటర్ లో డిపాజిట్ల గల్లంతు తర్వాతైనా విమర్శలకు స్వస్తి చెబితే మంచిది..’ అని కేసీఆర్ నారాయణకు సూటి గా సుత్తి లేకుండా కామెడీ గా సెటైర్ వేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *