నామినేటెడ్ పదవుల పందేరం

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ నామినేటెడ్ పోస్టులను పంపిణీ చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే నామినేటెడ్ పదువులను ఇప్పటి నుంచే ఎవరికి తోచిన రీతిలో వారు పైరవీలు చేస్తూ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పదవుల పంపిణీ కమిటీలో మంత్రి హరీష్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు సభ్యులుగా ఉన్నారు. దీంతో పైరవీ చేయించుకునేవారు, పైరవీ చేసే వారు అందరూ ఈ ముగ్గురు మంత్రుల చుట్టూనే ప్రదక్షిణలు చేస్తూ మంత్రుల అనుగ్రహం కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే పలు చోట్లలో అభ్యర్థుల పేర్లను నామినేటెడ్ పదవులకు ఖరారు చేసినట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *