నామినేటెడే ముద్దు.. అధ్యక్ష పదవులద్దు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో గ్రామ, మండల, జిల్లా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. కానీ పాత నాయకులకే మళ్లీ అధ్యక్ష పీఠాలు దక్కనున్నాయి. వీరికి పోటీగా నిలుచునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.. దీంతో యథాతథంగా పాతవారినే ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది.

కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఈద శంకర్ రెడ్డియే ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టుపై ఆయన ఆసక్తి చూపడం లేదని వినికిడి.  ఈయనే కాదు చాలా మంది జిల్లా అధ్యక్షులు మళ్లీ ఎన్నికవబోతున్నారు. కానీ వీరెవ్వరికి ఇందులో కొనసాగాలని లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో అందరూ ఏదో పదవి ఆశిస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నారు. దాని వల్ల ఆర్థికంగా నిలదొక్కుకుంటామని.. పార్టీ కోసం కష్టపడినందుకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అందుకే ఇప్పుడు జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలపై పెద్దగా టీఆర్ఎస్ లో ప్రభావం లేదు. నాయకులందరూ నామినేటెడ్ కోరడంతో పార్టీ పదవులన్నీ నామమాత్రంగా అయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *