నాబార్డ్ తో 874 కోట్ల రూపాయల రుణానికి ఒప్పందం

 

సూక్ష్మ సేద్యం పధకం అమలుకు తెలంగాణ ఉద్యాన అభివృద్ధి సంస్థ నాబార్డ్ తో 874 కోట్ల రూపాయల రుణానికి ఒప్పందం.

సోమవారం హైదరాబాద్ నాబార్డ్ కార్యాలయం లో తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యదర్శి సి. పార్థసారధి, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కమీషనర్ ఎల్. వెంకట్ రామ్ రెడ్డి, ఆపేడా (APEDA) డిజిఎం సుధాకర్, ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవీందర్ రెడ్డి కలసి నాబార్డ్ తరపున హైదరాబాద్ నాబార్డ్ కేంద్రం చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. రాధాకృష్ణన్, డిజిఎం సి. ఎస్. ఆర్. మూర్తి సూక్ష్మ సేద్యం అమలుకు తెలంగాణ ఉద్యాన అభివృద్ధి సంస్థ కు 874 కోట్ల రూపాయలను ఋణంగా ఇస్తున్నట్లు అధికారిక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ సాగు విస్తీర్ణం బావులు మరియు బోరు బావులపై ఆధారపడి ఉందన్నారు. సుమారు 42.82 లక్షల ఎకరాలు బావుల కింద సాగులో ఉండగా అధిక శాతం రైతులు పంటల సాగుకై కరెంటు మరియు బోరు బావుల పైన ఆధారపడరనారు.      మన రాష్ట్రంలోని  నేలల స్వభావం మరియు వాతావరణ పరిస్థితుల మార్పుల వలన  భూగర్భ జలాల తగ్గుదలను ధృష్టిలో ఉంచుకొని ఉన్న నీటిని సమర్దవంతంగా వినియోగించుకోవడానికి ఆధునిక నీటి పారుదల పద్దతులైన బిందు మరియు తుంపరుల సేధ్యం పై రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా సూక్ష్మ సేద్యం ద్వారా నీటి ఆదా, కలుపు నివారణ, పెట్టుబడి తగ్గడం, సమర్ధవంతంగా ఎరువుల వాడకం, మొక్కలు ఆరోగ్యాంగా పెరగడం తో పాటు అధిక దిగుబడి రావడం వంటి లాభాలు ఉంటాయన్నారు.        తెలంగాణ రాష్ట్రంలో సాగు నీటిని సమర్దవంతంగా ఉపయోగించుకోవడానికి 2003 సం. నుండి సూక్ష్మ సేధ్య పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని ఇప్పటి వరకు సుమారు 13.75 లక్షల ఎకరాలను బిందు, తుంపర్ల సేధ్యం క్రింద సాగులోకి వచ్చిందని ఇంకా 29.05 లక్షల ఎకరాలు మిగిలి ఉందన్నారు.        ఈ పద్దతుల వలన కలిగే ప్రయోజనాలను గుర్తించి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సూక్ష్మ సేధ్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం గా గుర్తించడం జరిగింది. అంతే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాధకత సాధించాలనే ఉద్దేశ్యంతో గౌరవ ముఖ్య మంత్రి వర్యులు ఈ పథకం క్రింద రాయితీలను పెంచి రైతుల కొరకు అమలు చేయడం జరుగుతుంది.

అంతే కాకుండా బిందు, తుంపర్ల సేధ్య పరికరాల సరఫరాకై  రైతుల నుండి పెరుగుతున్న డిమాండ్ ను ధృష్టి లో ఉంచుకొని గౌరవ ముఖ్య మంత్రి వర్యుల ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడలేని విధంగా నాబార్డ్ నుండి రూ. 874.00 కోట్ల రుణ సహాయం తో 3.15 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేధ్య పథకాన్ని 2016-17 & 2017-18 సం. లలో అమలు చేయడం జరుగుతున్నది.

2016-17 సం. కు గాను, ఈ నాబార్డ్ ప్రాజెక్టు క్రింద 2.23 లక్షల ఎకరాల భౌతిక లక్ష్యాలను అన్నీ జిల్లాలకు కేటాయించి అమలు చేయటం జరుగుతున్నది. జిల్లా వారిగా కేటాయించిన బిందు, తుంపర్ల లక్ష్యాలను జత పరచడమైనది.

మిగిలిన 89000 ఎకరాల లక్ష్యాన్ని 2017-18 సం. లో జిల్లాలకు కేటాయించడం  జరుగుతుందన్నారు. అంతే కాకుండా ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అందరికీ అంధుబాటులోకి తేవడం కొరకు మీ-సేవ సెంటర్ల ద్వారా వారి దరఖాస్తులను నమోదు చేసుకొనే సౌలభ్యం కలిగించడమైనది. దీనివలన రైతులు ఇక పై రాష్ట్రంలోని అన్నీ జిల్లా, మండల కేంద్రాలు మరియు గ్రామంలో తమకు అందుబాటులోకి ఉన్న మీ –సేవ కేంద్రాలలో నామ మాత్రపు రుసుము చెల్లించి  బిందు, తుంపర్ల సేధ్య పరికరాల మంజురి కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4606 మీ-సేవ కేంద్రాలలో ఎక్కడినుండైన దరఖాస్తు చేసుకోవచ్చును.

మీ –సేవ కేంద్రాలలో దరఖాస్తుల నమోదు పూర్తిగా బయో మెట్రిక్ విధానంలో జరుగుతుంది మరియు దరఖాస్తు దారుని వివరాలను ఆధార్ పోర్టల్ లో నమోదైన వివరాలతో సరిచూసుకొని, నిర్ధారణ చేసుకున్న తర్వాతే అట్టి దరఖాస్తు నమోదు చేయడం జరుగుతుంది.   తద్వారా దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఫలాలు నేరుగా అర్హులైన రైతులకు చేరవేయబడతాయి.

ఈ సదుపాయాన్ని ఉపయోగించు కోవడానికి రైతులు వారి ఆధార్ కార్డ్, భూమి యజమాన్యపు హక్కు పత్రము లేదా 1బి మరియు కుల ధృవీకరణ పత్రము (BC, SC, ST రైతులు) లతో మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చును.

దరఖాస్తు నమోదు  పూర్తయిన తర్వాత, అట్టి దరఖాస్తు ధృవ పత్రాల తనిఖీ కొరకు ఆన్ లైన్లో “డాకుమెంటేషన్ వెరిఫికేషన్” లాగిన్ లోకి చేరవేయబడతాయి. ఆ తదుపరి, సేనియారిటీ ప్రకారం క్షేత్ర స్థాయిలో ప్రాథమిక తనికి నిర్వహించి,  బెంచ్ మార్క్ సర్వే, బి‌ఓ‌క్యూ లు రూపొందించిన తర్వాత రైతుకు బిందు, తుంపర్ల సేధ్య పరికరాలు మంజురి అవుతాయి.

అంతే కాకుండా,  బిందు, తుంపర్ల సేధ్య పరికరాలు అమర్చిన ప్రతి రైతు పొలాన్ని శాటి లైట్ తో అనుసంధానం ద్వారా జియో ఫెన్సింగ్ చేయడానికి ప్రతిపాదించడమైనది.  దీని వలన పరికరాల వినియోగం తీరును మరియు రైతులు కావలిసిన సలహాను, సూచనలు ఇవ్వడం వలన అధిక ఆదాయం సాధించడం,  వారిని ఆర్ధిక ప్రగతి పథంలో నడిపించడానికి వీలు కలుగుతుంది.     కాబట్టి, రైతులందరు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున బిందు, తుంపర్ల సేధ్య విధానం ద్వారా ఉద్యాన పంటల సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించడం జరుగుతుందన్నారు.

ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, ఉద్యాన అభివృద్ధి సంస్థ మేనేజర్ సుభాషిణి, మైక్రో ఇరిగేషన్ డిప్యూటీ డైరెక్టర్ భాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *