నాన్నాకు ప్రేమతో నిర్మాతపై పవన్ ఫిర్యాదు

pawan-kalyan-case-for-balance-remuneration_b_1201160311

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మరో వివాదంలోకి ప్రవేశించారు. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పై ‘మా’ ఫిర్యాదు చేశారు.. అత్తారింటికి దారేది సినిమా రెమ్యునరేషన్ విషయంలో బీవీఎస్ఎన్ తనకు రెండు కోట్లు ఎగ్గొట్టాడని పవన్ ఫిర్యాదు చేయడంతో టాలీవుడ్ లో కలకలం మొదలైంది.. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో మిగతా రెమ్యునరేషన్ ఇస్తానని ప్రసాద్ మాట మార్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే సగం రిలీజ్ అయి పోయింది. దీంతో దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ ఆ సినిమా విడుదలైన తర్వాత హిట్ అయితే రెమ్యునరేషన్ తీసుకుంటామని మాట ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన నిర్మాత ప్రసాద్ పవన్ కు రావాల్సిన 2 కోట్లు చెల్లించలేదట.. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందు చెల్లిస్తానని ప్రసాద్ చెప్పి ఇవ్వలేదట.. దీంతో పవన్ ఫిర్యాదు చేశాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *